తెలంగాణ హైకోర్టులో చారిత్రాత్మక తీర్పు
(No Caste, No Religion )

తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో ఇవాళ (19.07.2023) చారిత్రాత్మక తీర్పు వెలువడిరది. హైదరాబాద్‌కు చెందిన సందేపాగు రూప, డేవిడ్‌ దంపతులు తమ కుమారుడు ఇవాన్‌ రూడేకి పుట్టుకతో కులరహిత, మతరహిత సర్టిఫికేట్‌ను ఇవ్వాలని తెలంగాణ హైకోర్టులో 2019 ఆగస్టు 28న నమోదు చేసిన రిట్‌ పిటిషన్‌పై ఇవాళ జస్టిస్‌ లలిత కన్నెగంటి కీలకమైన తీర్పును వెలువరించింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 25 ప్రకారం ఒక వ్యక్తి తనకు నచ్చిన మతాన్ని విశ్వసించే స్వేచ్చ ఉన్నట్లుగానే తమకు నమ్మకం లేని మతాన్ని విశ్వసించని హక్కు కూడా ఉంటుంది.